Sat, May 23, 2026
YouTube
Rivx Studios
News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ - Rivx Studios
World

రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్

Published on May 17, 2026 at 11:11 PM

2,187 Views

News Image
Quick Summary:

ఇప్పటికే చమురు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు.

ఇప్పటికే చమురు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. ఇటీవల రష్యా చమురు కొనుగోలుపై విధించిన మినహాయింపును రద్దు చేశారు. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మూసివేత నేపథ్యంలో ఇండియా సహా వివిధ దేశాలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ట్రంప్ తాత్కాలికంగా అనుమతించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మినహాయింపుపై విధించిన గడువు పూర్తైంది. అంటే, రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు అమలవుతాయి.

ఈ మినహాయింపును పొడిగించేందుకు ట్రంప్ సర్కార్ నిరాకరించింది. ఈ నిర్ణయం వల్ల అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడే దేశం ఇండియానే. ఎందుకంటే రష్యా నుంచి ఇండియా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తుంది. అందులోనూ హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా భారీగా తగ్గిపోవడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ఇండియాకు రష్యా చమురు ఎంతగానో ఉపయోగపడింది. కొద్ది రోజులుగా భారీ స్థాయిలో రష్యా చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. గత మార్చిలో 4.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను ఇండియా కొనుగోలు చేయగా, ఇందులో సగానికిపైగా చమురు రష్యా నుంచే దిగుమతి చేసుకుంది. ఇదే సమయంలో యుద్ధం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ నుంచి చమురు దిగుమతి 61 శాతం తగ్గింది.

గత ఏప్రిల్‌లో ఇండియాకు రష్యా అత్యధిక చమురు అందించింది. రోజుకు 1.57 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా నిషేధించిన నేపథ్యంలో.. ఇండియా ఆ చమురును కొనకపోతే దేశంలో మరింత సంక్షోభం తప్పదు. ఇటీవలి కాలంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలాంటిది రష్యా చమురు ఆగిపోతే పెట్రో బాదుడు భారీగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Verified Staff Journalist admin admin@rivxstudios.com