టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతి త్వరలోనే హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మహికా శర్మను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే సదరు వార్త సారాంశం. మే 22న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందని, అతి కొద్ది మంది సమక్షంలోనే ఈ వేడుక జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయపడడంతో గత రెండు మ్యాచ్‌ల్లో అతడు ఆడలేదు. ప్రస్తుతం అతడు ముంబైలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. హార్దిక్ మ్యాచ్‌లు ఆడకపోవడంతో అతడి రెండో పెళ్లి వార్త నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదని హార్దిక్ సన్నిహితులు చెబుతున్నారు. అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి అతడికి అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి అగస్త్య అనే కుమారుడు జన్మించాడు. అయితే.. వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విభేదాల కారణంగా ఈ జంట 2024లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నుంచి కొడుకు అగస్త్య బాధ్యతలను ఇద్దరూ కలిసే చూసుకుంటున్నారు. నటాషాతో విడాకుల తరువాత హార్దిక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ గెలిచిన తరువాత మైదానంలోనే మహికా శర్మతో హార్దిక్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Sports
రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా
Quick Summary:
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి రూమర్లు